99TV News

    జడ్పీ పీఠంపై కన్ను: తెదేపా, వైకాపాలో బీఫారాల వేట.. సీట్ల పంపకంపై ఉత్కంఠ!

    జడ్పీ పీఠంపై కన్ను: తెదేపా, వైకాపాలో బీఫారాల వేట.. సీట్ల పంపకంపై ఉత్కంఠ!

    పాడేరు (ఈనాడు డిజిటల్‌/న్యూస్‌టుడే): స్థానిక సంస్థల సమరంలో అత్యంత కీలకమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్లు దాఖలైనప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలేవీ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయకపోవడం, సీట్ల పంపకాలు కొలిక్కి రాకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ తమ తమ పార్టీల నుంచి ‘బీ-ఫారం’ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.జిల్లాల పునర్విభజన అనంతరం నూతన జిల్లా పరిషత్తు ఏర్పాటు కావడం, జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని ‘ఎస్టీ జనరల్‌’ కేటాయించడంతో ఈ సారి రేసులో తీవ్ర పోటీ నెలకొంది.కూటమిలో తేలని పొత్తులు.. తలనొప్పిగా మారిన పోటీ! తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. మూడూ పార్టీలకు చెందిన నేతలు జిల్లా పరిశీలకులు, సమన్వయకర్తలను కలిసి తమకే టికెట్ కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారు.సమన్వయ సమావేశాల్లో అభ్యర్థుల సామాజిక సమీకరణలు, ఆర్థిక బలాబలాలపై తీవ్రంగా చర్చిస్తున్నప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా జనసేన, ભાજపా పార్టీలకు చెరో 2 జడ్పీటీసీలు, మరియు చెరో 50 వరకు ఎంపీటీసీ స్థానాలను కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ముఖ్యనేతల వారసుల రేసు.. పాడేరులో పోటీ పీక్స్!అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం రాని సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు తమ వారసులను జడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు శ్రమిస్తున్నారు.గిడ్డి ఈశ్వరి కుమార్తె పోటీ: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన కుమార్తె మధుమితకు జడ్పీ ఛైర్‌పర్సన్ లేదా జడ్పీటీసీ పదవి దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మధుమిత ఇప్పటికే పాడేరు జడ్పీటీసీ స్థానానికి తెదేపా తరఫున నామినేషన్ సమర్పించారు.ఇదే స్థానం నుంచి తెదేపా నుంచి కొట్టగుళ్లి ఉషారాణి, చల్లంగి జ్ఞానేశ్వరి, మరియు కిల్లు రమేష్‌నాయుడు తల్లి వెంకట రత్నం సైతం తీవ్రంగా పోటీపడుతున్నారు.అరకులోయ జడ్పీటీసీ అభ్యర్థిగా తెదేపా నుంచి పెట్టెలి దాసుబాబుతో పాటు పలువురు నేతలు రేసులో ఉన్నారు.వైకాపాలో తిరుగుబాటు భయం.. బుజ్జగింపు చర్యలు!అటు ప్రతిపక్ష వైకాపాలోనూ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు కాకుండా ఇతరులకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పలువురు అసంతృప్త నేతలు స్వతంత్రంగా లేదా మద్దతుదారులతో నామినేషన్లు వేశారు.ఒకవేళ అధిష్ఠానం బీ-ఫారం ఇవ్వకపోతే స్వతంత్రులుగానే బరిలో నిలబడతామని స్పష్టం చేస్తున్నారు.వైకాపా జిల్లా నాయకత్వం రంగంలోకి దిగి నామినేషన్ వేసిన వారి వివరాలను సేకరిస్తోంది. అసమ్మతి నేతలను పిలిచి బుజ్జగించి, బి-ఫారం పొందే వారి విజయానికి సహకరించేలా సంప్రదింపులు జరుపుతున్నారు.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →